గోవాలో షాకింగ్ ఘటన: పోలీస్ అధికారిపై మైనర్ బాలిక అత్యాచార ఆరోపణలు

రిపోర్టర్: సురేష్ స్థలం: గోవా

ఉత్తర గోవాలో సహాయం కోసం వచ్చిన పదహారేళ్ల మైనర్ బాలికపై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వికాస్ డేకర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మీడియాకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన పోలీస్ అధికారి, సహకరించిన మహిళా సిబ్బంది రంజినీ పల్యేకర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఓల్డ్ గోవా పోలీస్ స్టేషన్కు దర్యాప్తును బదిలీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.