రూ. పదకొండు కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ భూమి పూజ

రిపోర్టర్: సతీష్ స్థలం: ఉరవకొండ

గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఎంఎం హళ్లి వద్ద రూ. 6.60 కోట్లతో వంతెన, రూ. 4.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు ఆయన గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి రోడ్లకు కొత్త రూపు తెస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ రహదారుల ఆధునికీకరణను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.