గురుకులంలో వేద విద్యనభ్యసించి ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగిన గోవింద్

రిపోర్టర్: రమేష్ స్థలం: Thiruvananthapuram

కేరళలోని త్రిస్సూర్ గురుకులంలో సాంప్రదాయ వేద విద్యను అభ్యసించి, కఠోర దీక్షతో ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు గోవింద్ కృష్ణన్. నాలుగో తరగతి వరకు సాధారణ చదువులు చదివిన ఆయన, ఆ తర్వాత బ్రహ్మస్వం మఠంలో యజుర్వేదాన్ని నోటి ద్వారా నేర్చుకున్నారు. త్రిస్సూర్ గురుకులంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు క్రమశిక్షణను అలవర్చుకున్న గోవింద్, ఆ తర్వాత జేఈఈ మెయిన్స్ లో విజయం సాధించి తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారని ఆయన తెలిపారు.