వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
నీట్ యూజీ కౌన్సెలింగ్లో అఖిల భారత కోటాలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి కేంద్ర వైద్య ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ విభాగం ప్రత్యేక రౌండ్ల షెడ్యూల్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సులకు సంబంధించిన ఈ ప్రత్యేక విడతల కౌన్సెలింగ్ తేదీలను వెల్లడించారు. నవంబర్ రెండు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.