రాజధాని అమరావతిలో వందేళ్ల భవిష్యత్తు కోసం ఆరు లేన్ల రహదారుల నిర్మాణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అత్యాధునిక హంగులతో సువిశాలమైన ఆరు వరుసల రహదారులను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముై్చ వందల కిలోమీటర్ల మేర గ్రిడ్ విధానంలో ఈ ట్రంక్ రోడ్లను డిజైన్ చేశామని, దీనివల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. పర్యావరణ హితంగా సైకిల్ ట్రాక్ లు, స్ట్రీట్ ఫర్నిచర్ తో పాటు స్మార్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.