భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది

రిపోర్టర్: అశోక్ స్థలం: ఇండియా

రాబోయే 25 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ సంచలన అంచనా వేశారు. ఆసియా వైపు ఆర్థిక దిశ మారుతోందని, చైనాను కూడా వెనక్కి నెట్టి భారత్ అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం తగ్గి గ్లోబల్ ట్రేడ్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.