ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో నడుపుతున్న బెంగళూరు యువతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: బెంగళూరు
కుటుంబ బాధ్యతలు, అనారోగ్య సమస్యల కారణంగా ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్గా మారినట్లు బెంగళూరుకు చెందిన యువతి తెలిపారు. తండ్రి మరణం తరువాత రాత్రి వేళల్లో తల్లిని గా ఉంచలేక, మారుతున్న షిఫ్టులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. పీసీఓడీ సమస్య, ప్రయాణ ఇబ్బందులతో సతమతమైన తాను.. ఆటో నడుపుతూ స్వయం ఉపాధి పొందుతూనే ఎక్కువ సంపాదిస్తున్నానని, సమయపాలన స్వేచ్ఛ దక్కిందని ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన్వి శెట్టితో చెప్పారు.