గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను కలిసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య మరియు మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. దండారి ఉత్సవాలకు కోటిన్నర రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాగోబా జాతర అభివృద్ధికి నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.