స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించినట్లు న్యాయవర్గాలు తెలిపాయి. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలని వైసీపీ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా రాబోయే ఆరు వారాల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.