రాజస్థాన్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లోని 309 పట్టణ స్థానిక సంస్థల కౌంటింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. మొత్తం 10,245 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోషల్ మీడియాలో తప్పుడు ఫలితాలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు జైపూర్‌లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎలాంటి అక్రమాలను సహించేది లేదని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ చీఫ్ విప్ రఫీక్ ఖాన్ హెచ్చరించారు.