బొబ్బిలిలో నిత్యం తాళం వేసి ఉంటున్న తూనికల కొలతల కార్యాలయం
రిపోర్టర్: అశోక్
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి డివిజన్లోని తూనికల కొలతల శాఖ కార్యాలయం ఎప్పుడూ మూసి ఉంటుందంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం పూట కార్యాలయం తెరుచుకోకపోవడం, మధ్యాహ్నం తర్వాతే తలుపులు తీస్తుండటంతో సేవలు అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ రెగ్యులర్ ఇన్స్పెక్టర్ లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు బాధ్యతలతో ఇన్ఛార్జ్ అధికారులే నెట్టుకొస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.