మియాపూర్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక నవరాత్రి వేడుకలు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మియాపూర్లోని మీసేవ, న్యూ కాలనీ, చిరంజీవి నగర్ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నదానం వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.