బీఆర్ఎస్ నేతల నోటి దురుసు ఆ పార్టీకే శాపంగా మారుతోంది!

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేదికగా బీఆర్ఎస్ నేతల ఆవేశపూరిత వ్యాఖ్యలు, అనుచిత భాష ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయి. స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దళిత ఆత్మగౌరవ సమస్యగా మారడంతో ఎమ్మెల్సీలపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అధికార పార్టీ ట్రాప్‌లో పడిన గులాబీ నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమై కేవలం వివాదాస్పద మాటలతోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.