ట్రైన్ లో నకిలీ టీటీ గుట్టురట్టు: తెల్లకాగితాలపై టికెట్లు ఇస్తూ పట్టుబడ్డ మహిళ

రిపోర్టర్: మహేష్ స్థలం: Maharashtra

మహారాష్ట్ర నుంచి బీహార్ వెళ్తున్న రైలులో అర్ధరాత్రి సమయంలో నకిలీ టీటీగా అవతారమెత్తి తెల్లకాగితాలపై టికెట్లు ఇస్తున్న మహిళను ప్రయాణికులు పట్టుకున్నట్లు నీతూ అనే ఎక్స్ యూజర్ తెలిపారు. ఎలాంటి యూనిఫామ్ లేకుండా ప్రయాణికుల వద్దకు వచ్చి టికెట్లు తనిఖీ చేస్తూ అనుమానాస్పదంగా వ్యవహరించిన ఆమె, గుర్తింపు కార్డు చూపించమంటూ ప్రయాణికులు నిలదీయడంతో అక్కడి నుంచి పరారైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.