పలాసలో అసాంఘిక కార్యకలాపాల నివారణకు డ్రోన్ల ద్వారా పోలీసుల నిఘా
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా తీవ్రతరం చేశారు. పాడుబడిన భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలలో జూదం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక కన్నేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.