విషాదం: ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు జనసేన అభ్యర్థి మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య గుండెపోటుతో మృతి చెందారని పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాలకు కేవలం ఒక్కరోజు ముందు ఆమె ఆకస్మికంగా కన్నుమూయడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు. ఫలితం చూడకుండానే ఆమె లోకం విడిచిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.