దేశంలోని అన్ని వ్యవస్థలపై కొందరి గుత్తాధిపత్యమంటూ రాహుల్ గాంధీ ఫైర్
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలోని ప్రతి వ్యవస్థను ఆర్ఎస్ఎస్, కొద్దిమంది వ్యక్తులు పూర్తిగా నియంత్రిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం, వ్యాపారం, విద్య, వైద్యం, మీడియా, న్యాయవ్యవస్థ మరియు ఎన్నికల సంఘంతో సహా అన్ని కీలక రంగాలు కొందరి చేతుల్లోనే బందీ అయ్యాయని ఆరోపించారు.