నర్సంపేట పరిధిలో పాకాల జలాలతో కళకళలాడుతున్న సంఘం కాలువ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
పాకాల సరస్సు నుంచి పంట పొలాలకు సాగునీరు తరలించే సంఘం కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది. గోదావరి జలాలను పాకాల సరస్సులోకి విడుదల చేస్తుండగా, అక్కడి నుంచి కాలువల ద్వారా క్రమంగా సాగునీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. సంఘం కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. సాగునీరు అందుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.