టెక్ దిగ్గజం మార్క్ జుకర్బర్గ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన అలెగ్జాండర్ వాంగ్
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ వాట్సాప్లో చాలా సుదీర్ఘమైన సమాధానాలను చాలా వేగంగా పంపుతారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ వెల్లడించారు. ఒక పాడ్కాస్ట్ సంభాషణలో ఆయన మాట్లాడుతూ, అంత బిజీ షెడ్యూల్ జుకర్బర్గ్ సమయాన్ని ఎలా కేటాయిస్తారో తనకు ఆశ్చర్యమనిపించిందని తెలిపారు. ప్రాధాన్యతలను ఖచ్చితంగా నిర్ణయించుకోవడం వల్లే ఆయన అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించగలరని వాంగ్ పేర్కొన్నారు.