ఆస్కార్ బరిలోని షార్ట్ ఫిల్మ్కు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ప్రియాంక చోప్రా

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

ప్రపంచవ్యాప్తంగా ఎనభైకిపైగా చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ షార్ట్ ఫిల్మ్ 'వీ వెర్ హియర్' చిత్రానికి ప్రముఖ నాయిక ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు అద్భుతమైన ఆలోచనతో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డు విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.