నిరుద్యోగులకు భారీ ఊరట: ఇక ఇంటి నుంచే ఆన్ లైన్ లో ఎల్ఎల్ఆర్ పరీక్ష

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోబోయే వారికి తెలంగాణ రవాణా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లెర్నర్ లైసెన్స్ పరీక్షను ఇకపై ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారా రాసేందుకు వీలుగా సరికొత్త విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను జోడించి ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించనున్నారు. తద్వారా అభ్యర్థులు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా అత్యంత సులభంగా తమ ఇంట్లోనే ఉండి ఎల్ఎల్ఆర్ పరీక్షను పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది.