నీటి కొరత వేళ స్పింక్లర్లతో పంటలను కాపాడుకోవాలి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు స్పింక్లర్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు డ్రిప్ మరియు స్పింక్లర్ సాగు విధానాన్ని అవలంబించి పంటలను విజయవంతంగా పండించాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.