గురుకులాల కిరాణా నిల్వల్లో అపరిశుభ్రత: పాడుబడిన భవనాలపై ఉపాధ్యాయుల తీవ్ర ఆందోళన
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కిరాణా టెండర్లను దక్కించుకున్న నేకాఫ్ సంస్థ సరుకుల నిల్వ కోసం అపరిశుభ్రమైన, పాడుబడిన భవనాలను ఎంపిక చేసిందని ఉపాధ్యాయ వర్గాలు వెల్లడించాయి. ఇండెంట్ సమర్పించి నెల దాటినా నేటికీ సరుకులు సరఫరా చేయలేదని, ఈ దుర్భర వాతావరణంలో సరుకులు నిల్వ చేస్తే విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.