సాకిబండ తండాలో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన గీతా ఆచారి
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండ తండాలో నూతనంగా చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ గీతా ఆచారి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారితో కలిసి స్వయంగా పరిశీలించారు. తండావాసులతో ముఖాముఖిగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా తండాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.