నాగలాపురం సమస్యల పరిష్కారంపై అధికారులకు బీజేపీ నాయకుడు కే. రాఘవేంద్ర విజ్ఞప్తి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఆదోని
నాగలాపురం గ్రామంలో వీధి దీపాల కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయకుడు కే. రాఘవేంద్ర అధికారులను ఆశ్రయించారు. అయితే ప్రజల సమస్యలపై పోరాడుతున్న తనను ప్లాట్ల యజమాని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నాగలాపురం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.