తెలంగాణలో తీవ్ర కరెంటు కష్టాలు: రానున్న రోజుల్ లో భారీ విద్యుత్ లోటు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో రానున్న కాలంలో తీవ్ర విద్యుత్ లోటు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు జర్నలిస్ట్ కొంటు మల్లేశం వెల్లడించారు. 2035-36 నాటికి రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 29,812 మెగావాట్లకు చేరుకోనుండగా, కేవలం 16,778 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలిపారు. దీంతో దాదాపు 13,034 మెగావాట్ల మేర భారీ కొరత ఏర్పడి రాష్ట్రం అంధకారంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.