రాముడి పాత్రకు రణ్‌బీర్ కంటే శ్రీకృష్ణుడి పాత్రే కరెక్ట్ అంటూ శివ్ సాగర్ వ్యాఖ్యలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Mumbai
నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణం చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించడంపై దివంగత ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ మనుమడు శివ్ సాగర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాముడి పాత్రకు బదులుగా రణ్‌బీర్ కపూర్ శ్రీకృష్ణుడి పాత్రకు మరింత సరిగ్గా సరిపోతాడని ఆయన అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ నటనపై తనకు ఎలాంటి విమర్శలు లేవని, అయితే రాముని పాత్రకు అవసరమైన గంభీరత, ప్రశాంతత కంటే కృష్ణుడి లీలల స్వభావం రణ్‌బీర్ నటనకు నప్పుతుందని ఆయన పేర్కొన్నారు.