భారీ సవాల్‌గా రోహిత్, కోహ్లీ: న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పష్టత
రిపోర్టర్: రాజేష్
స్థలం: Auckland
భారత అనుభవజ్ఞులైన బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కట్టడి చేయడం తమ బౌలర్లకు పెద్ద సవాల్‌గా మారుతుందని న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వెల్లడించారు. ఆక్లాండ్ లో బుధవారం జరిగే తొలి వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వయసు మీద పడుతున్నప్పటికీ వారిద్దరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని, పిచ్ పరిస్థితులకు తగినట్లుగా కఠినమైన బౌలింగ్ ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు.