అనంతపురంలో కలకలం: కుమారుడి కోసం ప్రచారం చేసిన సీపీఐ నేత బహిష్కరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనంతపురం
కుమారుడి గెలుపు కోసం రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి ప్రత్యర్థి కూటమి తరఫున ప్రచారం చేసిన సీపీఐ జిల్లా సమితి సభ్యుడు కోట్ల పోతులయ్యపై ఆ పార్టీ వేటు వేసింది. అనంతపురంలో భాజపా మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న కుమారుడి కోసం ఎర్రజెండాను కాదంటూ ప్రచారంలో పాల్గొన్న ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సీపీఐ నేతలు స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.