ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ‘జాకీ’ ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తమిళనాడు
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో తమ నాలుగో చిత్రాన్ని ప్రకటించింది. ధృవ్ విక్రమ్ హీరోగా, కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ‘జాకీ’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'నో రీటేక్స్ అలౌడ్' అనేది దీని ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.