ధాన్యపు గింజలతో ప్రపంచ నేతల అద్భుత చిత్రపటాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: ిల్లీ
దిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని చాటేలా ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు యోగేంద్ర పాల్ సింగ్ సోలంకి వివిధ రకాల చిరుధాన్యాలు, గింజలను ఉపయోగించి ప్రపంచ దేశాధినేతల అద్భుతమైన చిత్రపటాలను తీర్చిదిద్దారు. శ్రీ అన్న ప్రాముఖ్యతను, భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లేలా ఈ కళాకృతులను రూపొందించడం విశేషం.