యువత కోసం వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ వేదిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌-2027కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైభారత్‌ యువజనశాఖ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించనున్నారు. 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న యువత ఇందులో పాల్గొనవచ్చు. విజేతలు తమ ఆలోచనలను ప్రధానమంత్రికి సమర్పించే అరుదైన అవకాశం లభిస్తుంది.