ది ప్యారడైజ్ చిత్రంలో ప్రియదర్శి నటనపై రాహుల్ రామకృష్ణ ప్రశంసలు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ది ప్యారడైజ్ చిత్రంలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో అద్భుతంగా నటించిన ప్రియదర్శిని ఉద్దేశించి నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా బాపూ ఇచ్చి పడేసినావు అంటూ ప్రశంసలు కురిపించారని సినీ వర్గాలు వెల్లడించాయి. దీనికి ప్రియదర్శి తెలంగాణ యాసలో గిదా పద్ధతి అంటూ సరదాగా స్పందించడంతో వీరిద్దరి మధ్య సాగిన ఫన్నీ సంభాషణ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.