ఫౌజీ చిత్రంలో ప్రభాస్ తో నటించడంపై నటుడు సుబోధ్ భావే ప్రశంసలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర పోషిస్తున్న ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే తాజాగా తన అనుభవాలను పంచుకున్నారని వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఓం రౌత్ ద్వారా ప్రభాస్ తో తనకు తొలి పరిచయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫౌజీ చిత్రంలో ప్రభాస్ తో కలిసి ఒక రోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని, ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన ఎంతో సాధారణంగా, అందరితో ఆప్యాయంగా మెలిగారని సుబోధ్ భావే కొనియాడారు.