మహిళా కండక్టర్ మృతితో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం: బస్సులకు డోర్లు తప్పనిసరి
రిపోర్టర్: రాజేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. సిబ్బంది రక్షణే ధ్యేయంగా అన్ని బస్సులకు తప్పనిసరిగా తలుపులు అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు. డోర్లు మూసిన తర్వాతే బస్సులు కదలాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల బీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.