నెల్లూరులో ఈనెల 29న పల్లెపండగ భారీ సభ

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

రాష్ట్రంలో వీబీ జీరామ్జీ కింద పదకొండ వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ఈనెల ఇరవై తొమ్మిదవ తేదీన పల్లెపండగ భారీ సభ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు పార్టీల ప్రధాన నేతలు ఒకే వేదికపైకి వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.