ఎన్నికల వేళ ఆముదాలవలసలో ఆరువందల మందిపై బైండోవర్ కేసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆమదాలవలస
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మండలంలో ఇరు పార్టీలకు చెందిన ఆరు వందల మందిపై బైండోవర్ కేసు నమోదు చేశామని ఆముదాలవలస ఎస్ఐ బాలరాజు బుధవారం తెలిపారు. అత్యంత సమస్యాత్మక గ్రామంగా బొబ్బిలిపేట, సమస్యాత్మక గ్రామాలుగా చీమలవలస, కోర్లకోట గ్రామాలను గుర్తించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.