ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ నిరసన

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా నీరుగారుస్తున్నారంటూ వారు మండిపడ్డారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.