యాష్ టాంకర్ల డ్రైవర్ల వద్ద నుంచి వసూలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మార్గంలో ప్రయాణిస్తున్న ఫ్లయింగ్ యాష్ ట్యాంకర్ డ్రైవర్ల నుంచి అపరిచిత వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా మార్గం మార్చుకుని వెళ్తున్న తమను ఇస్కపాలెం వద్ద అడ్డుకుని ఒక్కో ట్యాంకర్ నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేశారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సూచనలు పాటిస్తే తమకు ఈ దుస్థితి ఎదురవుతోందని వాపోతూ సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.