సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా ఉపేంద్ర సినిమా రీ-రిలీజ్

రిపోర్టర్: గోపి స్థలం: కర్ణాటక

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం 'ఉపేంద్ర' సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పట్లో కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను ఎంజీ మూవీస్ బ్యానర్‌పై ఎం అచ్చిబాబు గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. రవీనా టాండన్, ప్రేమ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.