రైతన్నలకు తీపి కబురు: మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మదనపల్లె
ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాజెక్టులకు ఘనంగా శంకుస్థాపన చేసినట్లు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఈ చారిత్రక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు.