ఛత్తీస్‌గఢ్ లో విషాదం: ఇంట్ లో కుళ్ళిన స్థితిలో తల్లి, కుమారుడి మృతదేహాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: రాయ్‌పూర్
రాయ్‌పూర్ లోని గుధియారి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చోటా అశోక్ నగర్ ప్రాంతంలో ఒకే ఇంట్ లో అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్న తల్లి, కుమారుల మృతదేహాలను పోలీసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు స్పష్టం చేశారు.