రామాయణంలో రావణుడి పాత్రపై తన కుమారుడు అడిగిన ప్రశ్నలను వెల్లడించిన యశ్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రామాయణ చిత్రంలో తాను రావణుడి పాత్ర పోషిస్తుండటం పట్ల తన కుమారుడు యథార్వ్ ఆశ్చర్యపోయాడని కన్నడ నటుడు యశ్ తెలిపారు. తన తండ్రి రాముడు కావాలని, రావణుడు ఎలా అవుతాడని తన కుమారుడు ప్రశ్నించాడని ఆయన పేర్కొన్నారు. సినిమాల్ లో నటన గురించి అతనికి వివరించాల్సి వచ్చిందని, తెరపై పాత్రలు వేరు, నిజజీవితం వేరు అని అర్థం చేయించడం తనకు ఆశ్చర్యకరమైన అనుభూతిని మిగిల్చిందని ప్రముఖ నటుడు యశ్ వెల్లడించారు.