వాతావరణ హెచ్చరిక: కోస్తాంధ్రలో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

కొమొరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా రానున్న మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం తిరుపతిలో అత్యధికంగా ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. అనంతపురం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.