సచివాలయాల మ్యాపింగ్‌లో లోపం.. ధ్రువపత్రాల కోసం నగరవాసుల ఇక్కట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

విజయనగరం నగరంలో సచివాలయాలు అర్బన్‌ తహసీల్దారు కార్యాలయానికి మ్యాపింగ్‌ కాకపోవడంతో ధ్రువపత్రాల జారీలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న నగరవాసులు ఆన్‌లైన్‌ కాపీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు సమీపిస్తుండటంతో వృద్ధులు, వితంతువులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. త్వరలోనే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.