సీఈవో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ అభిజీత్ దిప్కే తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: పూణే
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయడం వ్యర్థమని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. పూణేలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విజయాలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జ్ఞానేష్ కుమార్ తప్పుకునే వరకు ఎన్నికలు పారదర్శకంగా జరగవని, ప్రతిపక్షాలు పోరాటం ఆపబోమని ఆయన తేల్చిచెప్పారు.