రాణీ మల్లమ్మదేవి పార్కు అభివృద్ధి: బొబ్బిలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ అధికారుల సహకారంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. నలభై లక్షలతో పార్కు అభివృద్ధి పనులు, పది లక్షలతో కూడలి సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.