కేంద్రం కీలక నిర్ణయం: సంక్షేమ పథకాల లబ్ధికి ఓటరు ఐడీ తప్పనిసరి

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విధానంలో ఆధార్ కు బదులుగా ఓటరు ఐడీని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి లలన్ సింగ్ ప్రకటించారు. నకిలీ లబ్ధిదారుల ఏరివేతకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా అర్హులైన నిజమైన పేదలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.