భారీ ఊరట: రికార్డు స్థాయి లాభాలతో దూసుకెళ్తున్న భారతీయ స్టాక్ మార్కెట్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ లో రికార్డు స్థాయి లాభాలతో దూసుకెళ్తున్నాయని నిపుణులు తెలిపారు. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం, ముడిచమురు ధరలు దిగిరావడం మన సూచీలకు కొండంత బలాన్నిచ్చాయని వారు పేర్కొన్నారు. దీని ప్రభావంతో బీఎస్ఈ సెన్సెక్స్ రెండు వేలకు పైగా పాయింట్లు జంప్ చేయగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన ఇరవై నాలుగు వేల ఐదు వందల మైలురాయిని దాటి లాభాల్ లో కొనసాగుతోందని స్పష్టం చేశారు.