ఎల్లమ్మ సినిమా టైటిల్ సాంగ్ అప్డేట్: సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాస్ వైబ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ జానపద కళాకారుల నేపథ్యంతో వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ చిత్రానికి సంబంధించి మేకర్స్ శుక్రవారం కీలక అప్డేట్ వెల్లడించారు. ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతుండగా, ప్రస్తుతం టైటిల్ సాంగ్ రికార్డింగ్ జరుగుతున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చిన వంద మంది జానపద రిథమ్ ప్లేయర్స్తో ఈ పాటను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు.